logo

50 ఏళ్ల తర్వాత సీతారాముల కల్యాణం

అర శతాబ్దం తర్వాత తొలిసారిగా శ్రీరాముడి జన్మ నక్షత్రం (శ్రీరామ నవమి) రోజున వాల్మీకిక్షేత్రంలో సీతారాముల కల్యాణం బుధవారం రాత్రి జరగబోతుంది. 1975లో వాల్మీక్షేత్రంలోని పట్టాభి రామాలయంలో శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం నిర్వహించారు.

Published : 17 Apr 2024 05:42 IST

వాల్మీకిక్షేత్రంలో అద్భుత ఘట్టం

కల్యాణానికి సిద్ధమైన వేదిక ప్రాంగణం

వాల్మీకిపురం, న్యూస్‌టుడే : అర శతాబ్దం తర్వాత తొలిసారిగా శ్రీరాముడి జన్మ నక్షత్రం (శ్రీరామ నవమి) రోజున వాల్మీకిక్షేత్రంలో సీతారాముల కల్యాణం బుధవారం రాత్రి జరగబోతుంది. 1975లో వాల్మీక్షేత్రంలోని పట్టాభి రామాలయంలో శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం నిర్వహించారు. మళ్లీ ప్రస్తుతం 2024లో శ్రీరామ నవమి రోజున ఇక్కడ స్వామివారి కల్యాణం ఎంతో విశేషంగా ఆరు బయట నిర్వహించేందుకు తితిదే సర్వం సిద్ధం చేసింది. దేశంలోని అన్ని ప్రధాన రామాలయాల్లో ప్రతి ఏటా శ్రీరాముడి జన్మ నక్ష్రతమైన పునర్వసు నక్షత్రం రోజున సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా వాల్మీకిక్షేత్రంలోని శ్రీ పట్టాభి రామాలయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా స్త్రీలకు ప్రాధాన్యం అన్నట్టుగా సీతమ్మ తల్లి జన్మ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున ఇక్కడ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. అయితే 50 ఏళ్లకు ఒకసారి పునర్వసు, ఆశ్లేష, నక్షత్రాలు కలయిక ఒకేరోజు వస్తాయి. అందులోనూ శ్రీరామ నవమి రోజున రావడం మరీ విశేషం. కల్యాణోత్సవం అనంతరం బంగారు గరుడ వాహనాన్ని అధిరోహించి సీతారాములు వాల్మీకిక్షేత్రంలోని నాలుగ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం భాగ్యం కల్పించనున్నారు. ఇందుకు తితిదే ప్రత్యేక ఏర్పాట్లును చేపట్టింది. 

వాల్మీకిపురం పట్టణంలోని వీరభద్ర గిరి సమీపాన తితిదేకు చెందిన విశాల ప్రాంగణంలో బుధవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని రాత్రి ఆరు బయట శ్రీసీతారాముల కల్యాణం నిర్వహించేందుకు జర్మన్‌ షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తితిదే గట్టి ఏర్పాట్లు చేసింది.

చింతాకు పతకం, చంద్రముఖి హారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని