logo

వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు

వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు పడ్డాయని మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా విమర్శించారు. రామసముద్రం మండలం ఆర్‌.నడింపల్లె గ్రామ పంచాయతీలో తెదేపా మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.

Published : 29 Apr 2024 03:45 IST

నడింపల్లెలో వృద్ధుడిని సన్మానించి ఓటు అభ్యర్థిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా

రామసముద్రం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు పడ్డాయని మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా విమర్శించారు. రామసముద్రం మండలం ఆర్‌.నడింపల్లె గ్రామ పంచాయతీలో తెదేపా మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. పల్లెల్లో వీధుల దుస్థితి, అస్తవ్యస్తంగా ఉన్న మురుగు కాలువలను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధికి కేంద్రం విడుదల చేసి నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లించుకుని గ్రామ పంచాయతీలను నిర్వర్యం చేశారని మండిపడ్డారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులను దిష్టిబొమ్మలుగా మార్చేసిన దుస్థితి ఈ వైకాపా ప్రభుత్వంలో నెలకొందని ఆవేదన వ్యక్తపరిచారు. అభివృద్ధి నిరోధక వైకాపా ప్రభుత్వానికి ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. అభివృద్ధికి బ్రాండు అంబాసిడర్‌గా ఉన్న చంద్రబాబు నాయుడును జరుగుతున్న ఎన్నికల్లో గెలిపించి ముఖ్యమంత్రిని చేద్దామని ఓటర్లకు పిలుపునిచ్చారు. మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో తెదేపా సీనియర్‌ నాయకులు సీఆర్‌.నారాయణరెడ్డి, కృష్ణమరాజుయాదవ్‌, శివకుమార్‌రెడ్డి, చిన్నూస్వామి, రాజేష్‌, నాగరాజయాదవ్‌, ఎల్‌.శివ, కిట్ట, రమేష్‌రెడ్డి, వెంకటేష్‌, చిన్నస్వామి, నరసింహులు, శ్రీనివాసులురెడ్డి, రఘునాథరెడ్డి, గంగాధర్‌, రెడ్డెప్ప, శ్రీనివాసులు, గంగప్ప తదితరులు పాల్గొన్నారు.

అచ్చం బాలకృష్ణలాగే...

బి.కొత్తకోట, ములకలచెరువు గ్రామీణ : బి.కొత్తకోట, ములకలచెరువులలో ఆదివారం నందమూరి బాలకృష్ణ డూప్‌ రోడ్‌షోను నిర్వహించారు. ప్రచార రథంపై నుంచి అచ్చం బాలకృష్ణలాగే హావభావాలు ప్రదర్శిస్తూ.. తెదేపా వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ తెదేపా నాయకులతో కలసి వీధుల గుండా ముందుకు సాగారు. ఎన్డీఏ అభ్యర్థులు జయచంద్రారెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిలను గెలిపించాలని కోరుతూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానికులు డూప్‌ బాలకృష్ణను ఆసక్తిగా తిలకించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు