logo

ఎన్‌డీఏ గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి

రాష్ట్రాభివృద్ధి ఎన్‌డీఏతోనే సాధ్యమని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప లోక్‌సభ తెదేపా అభ్యర్థి భూపేష్‌రెడ్డి అన్నారు. శనివారం కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన రామాంజుల్‌రెడ్డి, హనుమంతరెడ్డి, నాగేశ్వరరెడ్డి, వెంకటయ్య, నాగయ్య, ఓబులరెడ్డి, సుబ్బరాయుడు, సీమాన్‌, అజరయ్య, వీరాంజనేయరెడ్డి ఎన్డీఏ కూటమిలో చేరారు.

Published : 05 May 2024 04:58 IST

పార్టీలో చేరిన వారితో భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, తెదేపా కడప ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి

కొండాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధి ఎన్‌డీఏతోనే సాధ్యమని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప లోక్‌సభ తెదేపా అభ్యర్థి భూపేష్‌రెడ్డి అన్నారు. శనివారం కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామానికి చెందిన రామాంజుల్‌రెడ్డి, హనుమంతరెడ్డి, నాగేశ్వరరెడ్డి, వెంకటయ్య, నాగయ్య, ఓబులరెడ్డి, సుబ్బరాయుడు, సీమాన్‌, అజరయ్య, వీరాంజనేయరెడ్డి ఎన్డీఏ కూటమిలో చేరారు. వీరికి పార్టీల కండువాలు వేసి ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానిచ్చారు.

  • దొబ్బుడుపల్లె గ్రామానికి కుమార్‌, సుధాకర్‌, పెద్దబాద్దులా, ఆంజనేయులు తదితరులు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి సమక్షంలో ఎన్డీఏ కూటమిలో చేరారు. రానున్న ఎన్నికల్లో భూపేష్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పార్టీలో చేరినవారు తెలిపారు.

30 కుటుంబాలు చేరిక...

పోరుమామిళ్ల: పట్టణంలోని పాతకుమ్మరివీధిలో మాజీ వార్డు సభ్యుడు శివారపు నరసింహులు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలోకి చేరాయి. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వీరికి పార్టీ కండువాలు వేసి పార్టిలోకి ఆహ్వానించారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. ఎటువంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకరావాలని చెప్పారు. కూటమి అభ్యర్థి బొజ్జా రోశన్నను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భైరవప్రసాదు, సర్పంచి సుధాకర్‌, మండల నాయకులు సీతా వెంకటసుబ్బయ్య, హిమాంమ్‌హుసేన్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెదేపాలోకి కొనసాగుతున్న వలసలు...

మైదుకూరు: మైదుకూరు నియోజకవర్గంలో తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో కేశలింగాయపల్లె గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పసల వీరభద్రుడు, పవన్‌కుమార్‌, వినోద్‌కుమార, నడిపి వీరయ్య, పోతురాజు శంకర్‌, మధు, భాస్కర్‌, బండి జయరాం, రాజేష్‌, కేపీ శివలింగయ్య, తదితరులు తెదేపాలో చేరారు. మండలంలోని భాగ్యనగర్‌కు చెందిన ఆవుల పెద్ద గురవయ్య, బయనబోయిన వెంకటసుబ్బయ్య, కూడా  చేరారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ప్రొద్దుటూరులో బలం పెరుగుతోంది...

ప్రొద్దుటూరు వైద్యం: ప్రొద్దుటూరులో తెదేపా బలం పెరుగుతోందని, పార్టీలోకి వైకాపా నుంచి వలసలు, చేరికల వెల్లువ కొనసాగుతోందని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజులురెడ్డి అన్నారు. మండల పరిధిలోని తాళ్లమాపురంలో బాలసుబ్బారాడు, అంకిరెడ్డి, శంకర్‌బాబుతో పాటు పలు కుటుంబాలు పార్టీలో చేరాయి. వారికి ఆయన కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వానిôచారు. నంగనూరు పల్లిలో మాజీ సర్పంచి మేకల సుబ్బరామయ్యతోపాటు పలు కుటుంబాలు తెదేపాలో చేరాయి. వారందరికి తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని