logo

AP News: తిరుపతిని రాజధానిగా చేయాలి: చింతా మోహన్‌

అమరావతిలో రాజధానికి ప్రధానమంత్రి మోదీ వేసిన పునాది అనాదిగా మిగిలిందని, తిరుపతిని రాజధానిగా చేయాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ సూచించారు. సోమవారం సూళ్లూరుపేటలో ఆయన పర్యటించి మాట్లాడుతూ అమ

Updated : 21 Dec 2021 09:51 IST

మాట్లాడుతున్న చింతా మోహన్‌

 

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: అమరావతిలో రాజధానికి ప్రధానమంత్రి మోదీ వేసిన పునాది అనాదిగా మిగిలిందని, తిరుపతిని రాజధానిగా చేయాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ సూచించారు. సోమవారం సూళ్లూరుపేటలో ఆయన పర్యటించి మాట్లాడుతూ అమరావతి రైతులకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా ఉంటుందని చెప్పారు. రాజధానికి 1.5 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఏర్పేడు నుంచి రాపూరు వరకు అందుబాటులో ఉందని చెప్పారు. ఇక్కడ రాజధాని ఏర్పాటుచేస్తే 13 జిల్లాలకు అందుబాటులో ఉంటుందన్నారు. కండలేరు, సోమశిల జలాశయాలు ఉండటంతోపాటు, తిరుపతికి ఏడు జాతీయ రహదారుల కలయిక, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉందన్నారు. మోదీ పరిపాలన అధ్వానంగా ఉందని ఆరోపించారు. నల్లదనం కేంద్రంగా పీఎం కార్యాలయం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం పతనావస్థలో ఉందన్నారు. దుగరాజపట్నం ఓడరేవు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. శ్రీసిటీ, మేనకూరు, మాంబట్టు, కృష్ణపట్నం ప్రత్యేక ఆర్థిక మండళ్లలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా సెక్యూరిటీ, వాచ్‌మెన్‌లకు పరిమితం చేస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని