logo

చెన్నకేశవుడి వైభవం

స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది..

Published : 26 Apr 2024 05:09 IST

వింజమూరు, న్యూస్‌టుడే: స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. కావలి డీఎస్పీ వెంకటరమణ ఆధ్వరంలో పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధాన రహదారిలోని మండపంపై స్వామి వారి కల్యాణోత్సవం తెల్లవారుజామున జరిపించారు. రూ.15,300  చదివింపులు స్వామి వారి ఖాతాకు జమ చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బి. మల్లికార్జునరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని