logo

Suicide: సైకిల్‌ మరమ్మతులకు డబ్బులివ్వలేదని బాలుడి బలవన్మరణం

సైకిల్‌ మరమ్మతులకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన లంగర్‌హౌస్‌ ఠాణా పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 06 Jan 2022 07:30 IST

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: సైకిల్‌ మరమ్మతులకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన లంగర్‌హౌస్‌ ఠాణా పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం లంగర్‌హౌస్‌లోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు(16) తొమ్మిదో తరగతి. ఈ బాలుడి సైకిల్‌ పాడైపోగా.. మరమ్మతులు చేయించుకునేందుకు డబ్బులు ఇవ్వాలని మంగళవారం తండ్రిని కోరాడు. ఎంత ఖర్చవుతుందో కనుక్కో సాయంత్రం రాగానే ఇస్తానని చెప్పి తండ్రి పనికి వెళ్లిపోయాడు. బాలుడు మరోసారి ఉదయం 11 గంటలకు తల్లిని డబ్బులివ్వమని అడిగాడు. ఊయలలో ఉన్న తమ్ముడిని చూస్తూ ఉండూ.. దుస్తులు ఆరవేసి వస్తానని ఆమె డాబాపైకి వెళ్లారు. కొద్ది సేపటికి కిందికి వచ్చి చూస్తే.. చీరతో కట్టిన ఊయలకు బాలుడు ఊరేసుకుని కొన ఊపిరితో కనిపించాడు. కుటుంబీకులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయాడు.


కిటికీలోంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

ఖాదర్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌ సల్మాన్‌ కుమార్తె మహ్మద్దీయా (4) ఈనెల 2న మూడో అంతస్తులోని ఇంట్లో ఆడుకుంటోంది. తల్లి పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్నారి గ్రిల్స్‌ లేని కిటికీలోంచి మొదటి అంతస్తులోని రూఫ్‌టాప్‌పై పడింది. గాయాలైన బాలికను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ 3న చనిపోయింది. లంగర్‌హౌస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని