logo

Kamal Haasan: కమల్‌హాసన్‌ డిశ్ఛార్జి.. ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యుల ధ్రువీకరణ

వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరిన విశ్వనటుడు కమల్‌హాసన్‌ మంగళవారం డిశ్ఛార్జి అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న కమల్‌ వైద్య పరీక్షల కోసం సోమవారం పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు

Updated : 19 Jan 2022 08:22 IST

కోడంబాక్కం, న్యూస్‌టుడే: వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరిన విశ్వనటుడు కమల్‌హాసన్‌ మంగళవారం డిశ్ఛార్జి అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న కమల్‌ వైద్య పరీక్షల కోసం సోమవారం పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించిన తర్వాత మంగళవారం ఉదయం డిశ్ఛార్జి అయ్యారు. మరోవైపు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కమల్‌ నటిస్తున్న ‘విక్రం’ సినిమా చిత్రీకరణ పనులు కూడా ఆఖరిదశకు చేరుకున్నాయి. ఈ సినిమా పనులపై కమల్‌ ప్రస్తుతం దృష్టి పెట్టారు. ఇందులో విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని