icon icon icon
icon icon icon

LS polls: ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి.. భార్యకు టికెట్‌

సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహతో.. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేయాలని భావించాడు. లాలూ సూచన మేరకు లేటు వయసులో వివాహం చేసుకున్నాడు.

Published : 08 May 2024 17:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : అశోక్‌ మహతో (Ashok Mahto) మీకు తెలుసా? తెలియడం లేదా.. ‘నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఖాకీ గుర్తుందా.. అయితే మీకు మహతో తెలిసినట్టే. ఒక కరడుగట్టిన నేరగాడి ఆగడాలు.. అతనిని  పట్టుకున్న వైనాన్ని తెలుపుతూ బిహార్‌ ఐపీఎస్‌ అధికారి అమిత్‌లోదా వ్యూహాలపై ఓ పుస్తకం కూడా వచ్చింది. దీని ఆధారంగానే ‘ఖాకీ’ వెబ్‌సిరీస్‌ నిర్మించారు. ఇది మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది రియల్‌ మహతో గురించి..

అర్హత లేకపోవడంతో..

సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహతో.. విడుదలైన అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేయాలని భావించాడు. బిహార్‌లోని ముంగేర్‌ నుంచి పోటీకి సిద్ధమయ్యాడు. అయితే నిబంధనలు అంగీకరించక పోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ను సంప్రదించాడు. మహతో వివాహం చేసుకుంటే ఆయన భార్యకు టికెట్‌ ఇస్తామని లాలు సూచించారు. దీంతో 56 ఏళ్ల వయసులో 46 ఏళ్ల అనితను మహతో వివాహం చేసుకున్నాడు. ఇచ్చినమాట ప్రకారమే ఆర్జేడీ కూడా అనితా మహతోకు ముంగేర్‌ లోక్‌సభ సీటు కేటాయించింది.

లాలన్‌సింగ్‌కు అండగా మరో బాహుబలి

ఇదే స్థానం నుంచి ఎన్డీయే కూటమి తరఫున లాలన్‌సింగ్‌ అలియాస్‌ రంజన్‌సింగ్‌ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మరో నేర నేత అనంత్‌సింగ్‌ రంగంలోకి దిగారు. అక్రమ ఆయుధాలను కలిగివున్నందుకు ఆయనకు న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన పెరోల్‌పై బయటకు వచ్చారు. అనంత్‌సింగ్‌పై దాదాపు 38 క్రిమినల్‌ కేసులున్నాయి. ఇద్దరు నేరమయ నేతల ప్రవేశంతో అక్కడ రాజకీయం వేడెక్కింది.   జూన్‌ 4న జరిగే కౌంటింగ్‌లో వీరి భవితవ్యం తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img