icon icon icon
icon icon icon

ఝార్ఖండ్‌ అంటే అవినీతి.. అరాచకం

నిలువెల్లా అవినీతి, అరాచకాలకు మారుపేరుగా ఝార్ఖండ్‌ నిలుస్తోంది. దీనివల్ల వలసలు పెరిగిపోతున్నాయి. ఖనిజాలకు నిలయమైనా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే వాతావరణం లేదు.

Updated : 10 May 2024 05:58 IST

నిలువెల్లా అవినీతి, అరాచకాలకు మారుపేరుగా ఝార్ఖండ్‌ నిలుస్తోంది. దీనివల్ల వలసలు పెరిగిపోతున్నాయి. ఖనిజాలకు నిలయమైనా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే వాతావరణం లేదు. అనుమతుల పేరిట జలగల్లా దోచుకోవడం ఎక్కువైంది. రాష్ట్ర సర్కారును మార్చడం ప్రస్తుత అవసరం.

రాంచీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌


ప్రియాంక గుమాస్తా.. అమేఠీలో కాంగ్రెస్‌ అభ్యర్థి

అమేఠీ నుంచి బరిలో దిగేందుకు ప్రియాంకాగాంధీ గుమాస్తాకు కాంగ్రెస్‌ అవకాశమిచ్చింది. అక్కడ స్థానిక నాయకులే లేరా? రాయ్‌బరేలీలో భారీ తేడాతో రాహుల్‌ ఓడిపోతారు. ప్రియాంక ఇక్కడ ప్రచారం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడి ప్రజలకు ఆమె ప్రాధాన్యమివ్వరు. ఇక్కడ నివాసం ఉండరు. వాగ్దానాలు నిలబెట్టుకోరు. ప్రజలకు అండగా నిలవరు. రాయ్‌బరేలీ, అమేఠీ అంటే గాంధీ కుటుంబానికి ద్వేషం.

పీటీఐతో భాజపా రాయ్‌బరేలీ అభ్యర్థి దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌


అమేఠీలో గెలుపు గాంధీ కుటుంబానిదే

అమేఠీలో నా గెలుపు గాంధీ కుటుంబ విజయం అవుతుంది. ఎందుకంటే ఇది ఆ కుటుంబానికి విలువైన ఆస్తి. మేం ఇక్కడ ఓటమిని అంగీకరించామని చెప్పడం భాజపా అహంకారానికి నిదర్శనం. గతంలో సోనియాగాంధీ కోసం మా పార్టీ నేత కెప్టెన్‌ సతీశ్‌శర్మ ఈ స్థానాన్ని వదులుకున్నట్లే.. అవసరమైతే నేను కూడా వదులుకుంటా.

 పీటీఐతో అమేఠీలో కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోరీలాల్‌ శర్మ


బెంగాలీలను అవమానపరిచిన భాజపా

పశ్చిమబెంగాల్‌ ప్రతిష్ఠను దెబ్బకొట్టేరీతిలో, 10 కోట్ల మంది బెంగాలీలను అవమానపరిచేలా భాజపా వ్యవహరిస్తోంది. ఇటీవలి పరిణామాలు దీన్ని మరింత బలపరుస్తున్నాయి. సందేశ్‌ఖాలీ విషయంలో మా పార్టీపై బురద జల్లించడానికి తప్పుడు ఆరోపణలు కూడా చేయించారు. దీనికి ప్రజలు బ్యాలెట్‌తో సమాధానమిస్తారు.

 వర్చువల్‌ ప్రసంగంలో తృణమూల్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img