icon icon icon
icon icon icon

అయోధ్యకు తాళం పచ్చి అబద్ధం

కేంద్రంలో ఇండియా కూటమి నెగ్గితే అయోధ్యలో రామాలయానికి ‘బాబ్రీ తాళం’ పడుతుందని ప్రధాని చెబుతుండటం పచ్చి అబద్ధమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఖండించారు.

Published : 10 May 2024 05:56 IST

కోర్టు తీర్పును గౌరవిస్తాం: ప్రియాంక

రాయ్‌బరేలీ: కేంద్రంలో ఇండియా కూటమి నెగ్గితే అయోధ్యలో రామాలయానికి ‘బాబ్రీ తాళం’ పడుతుందని ప్రధాని చెబుతుండటం పచ్చి అబద్ధమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఖండించారు. న్యాయస్థానం తీర్పును తాము గతంలోనూ గౌరవించామని, ఇకపైనా గౌరవిస్తామని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌కు మద్దతుగా గురువారం ప్రచారం నిర్వహించిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అదానీ-అంబానీల విషయంలో ప్రధాని చేసిన మరో విమర్శను ఆమె గుర్తుచేస్తూ- వారిద్దరి పేర్లను ప్రతిరోజూ తన సోదరుడు రాహుల్‌గాంధీ ఏదో ఒక సభలో ప్రస్తావిస్తూనే ఉన్నారని చెప్పారు.

మోదీజీ మా మ్యానిఫెస్టో చదివి మాట్లాడండి

‘మోదీ ప్రధాని అయినప్పటికీ, నాకంటే పెద్దవారే అయినా మా మ్యానిఫెస్టోపై విమర్శలు చేయడానికి ముందు దానినొకసారి చదవాలనేది నా సూచన. ఏది గుర్తుకొస్తే అది మా మ్యానిఫెస్టోలో రాసి ఉందని చెబుతున్నారు. అందుకే ఒకసారి చదివితే అలా ఉందోలేదో తెలిసిపోతుంది. ప్రజా సమస్యలను రోజూ మేం లేవనెత్తుతున్నాం. వాటిపై నోరు మెదపనిది భాజపాయే. ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ నేరుగా భాజపాతో కలిసి పనిచేస్తున్నారు. భాజపాకి అవసరమైన చోట ఆయన తన అభ్యర్థుల్ని నిలిపి ఇతర పార్టీలను వెనక్కి నెడుతుంటారు. తెలంగాణ ఎన్నికల్లోనూ అది రుజువైంది’ అని ప్రియాంక వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img