icon icon icon
icon icon icon

మోదీ మరోసారి ప్రధాని కాలేరు

లోక్‌సభ ఎన్నికలు క్రమంగా ప్రధాని నరేంద్రమోదీ చేజారిపోతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. ఈ పరిస్థితుల్లో దేశ యువత దృష్టిని మళ్లించడానికి రాబోయే నాలుగైదు రోజుల్లో ఆయనొక కొత్త డ్రామా చేసేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు.

Updated : 10 May 2024 06:47 IST

ఎన్నికలు ఆయన చేజారిపోతున్నాయి
దృష్టి మళ్లించడానికి ఏదో కొత్త డ్రామా చేస్తారు: రాహుల్‌

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు క్రమంగా ప్రధాని నరేంద్రమోదీ చేజారిపోతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. ఈ పరిస్థితుల్లో దేశ యువత దృష్టిని మళ్లించడానికి రాబోయే నాలుగైదు రోజుల్లో ఆయనొక కొత్త డ్రామా చేసేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ఈ మేరకు గురువారం రాహుల్‌ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘మోదీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశం లేదు. ఆయన చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మి గందరగోళంలో పడకండి. ఇండియా కూటమి చెప్పేది వినండి. ఉద్యోగాలను ఎంచుకోండి.. విద్వేషాన్ని కాదు. జూన్‌ 4న కేంద్రంలో ఇండియా కూటమి సర్కారు అధికారంలోకి రాగానే 30 లక్షల ఉద్యోగాల భర్తీపై పని ప్రారంభిస్తుంది. ఆగస్టు 15లోగానే అది మొదలవుతుంది. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. అబద్ధాలు చెప్పి పెద్దనోట్లు రద్దు చేశారు. జీఎస్టీని తప్పుగా అమలు చేశారు. పూర్తిగా అదానీ వంటి పారిశ్రామికవేత్తల కోసమే పనిచేశారు’’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img