icon icon icon
icon icon icon

బూత్‌ల వారీగా పోలైన ఓట్లు వెబ్‌సైట్‌లో ప్రచురించాలి

లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన మూడు దశల పోలింగులో బూత్‌ల వారీగా పోలైన మొత్తం ఓట్ల వివరాలను ఈసీ వెబ్‌సైటులో ప్రచురించాలని పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, పదవీ విరమణ పొందిన సివిల్‌ సర్వెంట్లు డిమాండ్‌ చేశారు.

Published : 10 May 2024 05:57 IST

ఈసీని కోరిన సామాజిక కార్యకర్తలు

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన మూడు దశల పోలింగులో బూత్‌ల వారీగా పోలైన మొత్తం ఓట్ల వివరాలను ఈసీ వెబ్‌సైటులో ప్రచురించాలని పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, పదవీ విరమణ పొందిన సివిల్‌ సర్వెంట్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఎన్నికల సంఘానికి వారు లేఖ రాశారు. పటిష్ఠమైన ప్రజాస్వామ్య పనితీరు నిర్ధారణకు ఎన్నికల ప్రక్రియపై ప్రజావిశ్వాసం కీలకమని అందులో పేర్కొన్నారు. ఈసీ ప్రకటించిన మొదటి రెండు దశల పోలింగు గణాంకాల్లో హెచ్చతగ్గులు ఎక్కువగా ఉన్నాయని ఆక్షేపించారు. ఆయా నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా నమోదైన ఓట్ల వాస్తవ గణాంకాలు అభ్యర్థుల వద్ద అందుబాటులో ఉంటాయని ఈసీ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ప్రశాంత్‌ భూషణ్‌, వృందా గ్రోవర్‌, అంజలీ భరద్వాజ్‌, విపుల్‌ ముద్గల్‌, షబ్నం హష్మీ, జయతీ ఘోష్‌, శైలేష్‌ గాంధీ, ఎం.జి.దేవసహాయం తదితరులు సంతకాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img