icon icon icon
icon icon icon

అసెంబ్లీలో.. అన్నదమ్ములు

 కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కొత్తా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌పార్టీ నుంచి 1978, 1983, 1985లో వరుసగా గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగారు.

Updated : 12 Nov 2023 13:05 IST

 కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కొత్తా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌పార్టీ నుంచి 1978, 1983, 1985లో వరుసగా గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగారు. హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన కొత్తా వెంకటేశ్వరరావు 1989లో పోటీ చేయకుండా ఆయన తమ్ముడు కొత్తా రామచంద్రారావును కాంగ్రెస్‌ నుంచి ఎన్నికల బరిలో దింపి గెలిపించుకున్నారు. వీరిద్దరు 1985, 1989లో సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డిని ఓడించడం గమనార్హం. తర్వాత 1994లో కొత్తా సోదరులు పోటీ చేసి ఇద్దరు ఓటమి పాలయ్యారు.

  • జడ్చర్ల నియోజకవర్గంలో ఎర్ర సోదరులు మరాఠి సత్యనారాయణ, మరాఠి చంద్రశేఖర్‌ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. 1994లో తెదేపా తరఫున మరాఠి సత్యనారాయణ (ఎర్ర సత్యం) 53వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యే మరాఠి సత్యనారాయణ మృతితో 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో సోదరుడు మరాఠి చంద్రశేఖర్‌ తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2009లో తెదేపా తరఫున మరాఠి చంద్రశేఖర్‌ పోటీ చేసి గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన హాట్రిక్‌ సాధించారు.

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే : ఉమ్మడి రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాగా ఉన్నప్పుడు పలు నియోజకవర్గాల్లో అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. కాంగ్రెస్‌లో, తెదేపాలో, స్వతంత్రులుగా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కొల్లాపూర్‌లో కొత్తా సోదరులు వెంకటేశ్వరరావు, రామచంద్రారావు, గద్వాలలో డీకే సోదరులు సమరసింహారెడ్డి, భరతసింహారెడ్డి, జడ్చర్లలో ఎర్ర సోదరులు మరాఠి సత్యనారాయణ, మరాఠి చంద్రశేఖర్‌ శాసనసభ్యులుగా రాణించారు.
 గద్వాల నియోజకవర్గంలో డీకే సోదరులు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. డీకే సమరసింహారెడ్డి కాంగ్రెస్‌ నుంచి 1983, 1985, 1989లో ఎమ్మెల్యేగా కొనసాగారు. కోర్టు తీర్పుతో 1985లో మాత్రం చివరి ఏడాదిలో ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది. 1994లో సోదరుడు డీకే భరతసింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img