icon icon icon
icon icon icon

గాంధీ కుటుంబానికి నేనేం సేవకుడిని కాదు: అమేఠీ కాంగ్రెస్‌ అభ్యర్థి

తనను గాంధీ కుటుంబానికి ప్యూన్‌గా అభివర్ణించిన భాజపాపై కాంగ్రెస్‌ అమేఠీ అభ్యర్థి కేఎల్‌ శర్మ స్పందించారు. 

Published : 05 May 2024 19:51 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ (Amethi) నుంచి కాంగ్రెస్‌ (Congress) తరఫున కిశోరీలాల్‌ శర్మ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తనను గాంధీ కుటుంబానికి చెందిన ప్యూన్‌గా భాజపా అభివర్ణించడంపై ఆయన స్పందించారు. తాను రాజకీయవేత్తనని, గాంధీ కుటుంబానికి సేవకుడిని కాదంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.

‘‘అమేఠీ అభ్యర్థిగా ప్రకటించడం అనేది పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం. స్మృతి ఇరానీని ఓడిస్తాననే పూర్తి విశ్వాసం ఉంది. నేను చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నా. 1983లో కాంగ్రెస్‌తో అనుబంధం వల్ల ఇక్కడకు వచ్చాను. నేను రాజకీయ నాయకుడిని. ఆ కుటుంబానికి సేవకుడిని కాదు’’ అని అన్నారు.

వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!

‘‘కేంద్రంలోని భాజపా మీడియాను ఆయుధంగా మార్చుకుంది. ప్రతిపక్ష నేతలపై దాన్ని ప్రయోగిస్తోంది. రాజకీయ పార్టీలు, నేతలు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలులేకుండా ప్రతికూల పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. గత 10 సంవత్సరాల్లో ఏం చేశారంటూ ప్రజలు భాజపాను ప్రశ్నిస్తుంటే.. నిజమైన సమస్యల నుంచి దారి మళ్లించడానికి మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నారు. 2014 నుంచి వారి మేనిఫెస్టో చూడండి. 2022 నాటికి ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు ఇస్తామన్నారు. ఇంకా ఆ హామీ నెరవేర్చనేలేదు’’ అని శర్మ అన్నారు. అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో చివరి వరకూ కాంగ్రెస్‌ సస్పెన్స్‌ కొనసాగించింది. చివరి నిమిషంలో.. అమేఠీ నుంచి కేఎల్‌ శర్మను, రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీని బరిలోకి దింపిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img