icon icon icon
icon icon icon

Priyanka Gandhi: మరణమే వారసత్వంగా మా నాన్నకొచ్చిన ఆస్తి: ప్రియాంక గాంధీ

ప్రాణత్యాగం తప్ప తన తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏదీ లేదని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రధాని మోదీ విమర్శలపై ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 02 May 2024 21:28 IST

Priyanka Gandhi | మోరెనా (మద్య ప్రదేశ్‌): వారసత్వ పన్నుపై భారతీయ జనతా పార్టీ నుంచి రాజకీయంగా విమర్శలు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ పదే పదే చేస్తున్న విమర్శలకు బదులిచ్చారు. తన తండ్రికి వాళ్ల అమ్మ (ఇందిరా గాంధీ) నుంచి ఆస్తికి బదులు మరణమే వారసత్వంగా వచ్చిందన్నారు.

ఇటీవల నరేంద్రమోదీ ఓ సభలో మాట్లాడుతూ.. చనిపోయిన వ్యక్తుల ఆస్తిలో సగం ప్రభుత్వానికి వెళ్లేలా చట్టం ఉండేదన్నారు. రాజీవ్‌ గాంధీ అధికారంలోకి వచ్చాక వారసత్వ పన్నును రద్దు చేశారన్నారు. తన తల్లి ఇందిరా గాంధీ నుంచి తనకు సంక్రమించాల్సిన ఆస్తిపై పన్ను భారం పడకుండా ఉండేందుకు దీన్ని రద్దు చేశారంటూ ఒక టాక్‌ కూడా ఉండేదని ఆరోపించారు. దీనిపై తాజాగా మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక మాట్లాడారు.

వైకాపా రంగుల పిచ్చితో రూ.2300 కోట్లు దుబారా: పవన్‌ కల్యాణ్‌

‘‘మా నాన్నమ్మ ఈ దేశం కోసం ప్రాణాలర్పించారు. అదే రీతిన నా తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయారు. మా నాన్నకు వచ్చిన ఆస్తి అదే’’ అంటూ ప్రియాంక గాంధీ ఉద్వేగంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ వస్తే రెండు బర్రెలు ఉంటే ఒకదాన్ని తీసుకుంటుందని అబద్ధాలు చెప్పడం మానేసి ముందు యూపీ, మధ్యప్రదేశ్‌లో ఆవులు, గేదెల కోసం షెల్టర్లు నిర్మించాలన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ హయాంలో గోశాలలు నిర్మించిందని గుర్తుచేశారు. దీనివల్ల మహిళలకు ఉపాధి సైతం లభించేందన్నారు.

దేశంలో ఎప్పుడూ లేని రీతిలో మోదీ హయాంలో నిరుద్యోగం పెరిగి పోయిందని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పరీక్షల పేపర్లను లీక్‌ చేసి.. భాజపా నిరుద్యోగుల పొట్ట కొడుతోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ హయాంలో 20-22 మంది అనుకూల వ్యాపార వేత్తలకు చెందిన రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని దుయ్యబట్టారు. గడిచిన పదేళ్లలో పేదవాడు మరింత పేదరికంలోకి కూరుకుపోయారని ఆవేదన వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img