icon icon icon
icon icon icon

PM Modi: రాహుల్‌.. వారి గురించి ఇప్పుడు మాట్లాడవే: ప్రధాని మోదీ

ప్రధాని మోదీ తెలంగాణలోని వేములవాడ సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని ఉద్దేశించి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 

Published : 08 May 2024 15:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హఠాత్తుగా రాహుల్‌ గాంధీ ఈ ఎన్నికల్లో అంబానీ - అదానీల గురించి మాట్లాడడం మానేశారెందుకని ప్రధాని మోదీ ప్రశ్నించారు. వారితో ఏమైనా రహస్య ఒప్పందం కుదిరి ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘మీరు గత ఐదేళ్ల నుంచి కాంగ్రెస్‌ యువరాజును చూడండి. తరచూ అంబానీ-అదానీ పేర్లే చెబుతుంటాడు. కానీ, ఎన్నికల ప్రకటన వచ్చిన నాటినుంచి వారిని వెక్కిరించడం మానేశాడు. వారి నుంచి ఎంత సొమ్ము తీసుకొన్నారో రాహుల్‌ తెలంగాణ ప్రజలకు చెప్పాలి. డబ్బు కట్టలతో భారీ వాహనాలు కాంగ్రెస్‌కు చేరుకొన్నాయా. ఏం ఒప్పందం జరిగింది..? రాత్రికి రాత్రే వారిని విమర్శించడం ఆపేశావు. మొత్తం మీద కచ్చితంగా ఏదో ఉంది’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. భాజపా నేషన్‌ ఫస్ట్‌ అని పనిచేస్తుంటే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు మాత్రం ఫ్యామిలీ ఫస్ట్‌ అని అంటున్నాయన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్‌ అవమానించడానికి ఈ పాలసీనే కారణమన్నారు. 

గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తరచూ ప్రధాని మోదీని విమర్శిస్తూ ఆయనకు అంబానీ-అదానీ సన్నిహితులని, వారి కోసమే పాలసీలు చేస్తారని ఆరోపించేవారు. ఆయన ఎన్నికల ప్రచారాల్లో వారిద్దరే ప్రధాన అజెండాగా ఉండేవి. నిన్న కూడా రాహుల్‌ ఝార్ఖండ్‌లో మాట్లాడుతూ ‘భాజపా మీరు వనవాసులని అంటుంది.. అటవీ భూములను అదానీకి ఇస్తుంది’ అని వ్యాఖ్యానించారు. 

మరోవైపు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించింది. ఆ పార్టీ ప్రతినిధి ప్రవీణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘అంబానీ-అదానీలతో ప్రధాని బంధాన్ని రాహుల్‌ తరచూ బయటపెడుతుండటం ఇబ్బందికరంగా మారినట్లుంది. ఆయన మాటల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img