అమ్మాయి.. గుర్రంలా గంతులేస్తోంది!
గుర్రపు పందాలను ప్రత్యక్షంగా లేదా టీవీల్లో చూసే ఉంటారు. గుర్రాలపై జాకీలు కూర్చొని వాటిని పరుగెత్తిస్తుంటారు. కొన్ని రేసుల్లో మధ్యమధ్యలో కంచెలుంటాయి. వాటిపై గుర్రాలు దూకాల్సి ఉంటుంది. అలా గుర్రాలు వాటిపై నుంచి గంతులేస్తూ పరిగెడుతూ చేసే విన్యాసాలు
ఇంటర్నెట్ డెస్క్: గుర్రపు పందేలను ప్రత్యక్షంగా లేదా టీవీల్లో చూసే ఉంటారు. గుర్రాలపై జాకీలు కూర్చొని వాటిని పరిగెత్తిస్తుంటారు. కొన్ని రేసుల్లో మధ్యమధ్యలో కంచెలుంటాయి. వాటిపై గుర్రాలు దూకాల్సి ఉంటుంది. అలా గుర్రాలు కంచెలపై నుంచి దూకుతూ.. పరిగెడుతూ చేసే విన్యాసాలు భలే ఉంటాయి. కానీ, ఎప్పుడైనా మనిషే గుర్రంలా పరిగెత్తడం, కంచెలపై నుంచి దూకడం చూశారా? కెనడాకి చెందిన పదిహేడేళ్ల ఓ అమ్మాయి ఆ విన్యాసం చేసి చూపిస్తోంది. కాళ్లతోపాటు రెండు చేతుల్ని నేలపై ఉంచి గుర్రంలా పరుగెడుతూ.. కంచెలపై నుంచి దూకుతూ వార్తల్లోకెక్కింది.
కెనడాలోని ఎడ్మోంటన్‌కు చెందిన ఎవా వొగెల్ చిన్ననాటి నుంచే హై జంప్ చేయడం సాధన చేసింది. పదేళ్ల వయసులో గుర్రపు స్వారీ నేర్చుకోవడం ప్రారంభించింది. అయితే తన గుర్రం కంచెలపై నుంచి జంప్ చేసే విధానం గమనించిన ఎవా తను కూడా గుర్రంలా జంప్ చేస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచించింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టింది. గత మూడేళ్లుగా గుర్రంలాగా జంప్ చేయడం ప్రాక్టీస్ చేస్తోంది. ప్రస్తుతం కంచెలపై సునాయాసంగా జంప్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ‘జంపింగ్ లైక్ ఎ హార్స్’ వీడియోలను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేస్తూ అందర్ని ఆకట్టుకుంటోంది. ఎవా విన్యాసాలను మీరూ చూసేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్‌రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్‌ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్‌పై జిరోదా సీఈవో పోస్ట్