Mini Olympic Stadium: ఐస్‌క్రీమ్ పుల్లలతో మినీ ఒలింపిక్స్‌ స్టేడియం

ఒడిశాలోని పూరీకి చెందిన 14 ఏళ్ల బాలిక నందిని పట్నాయక్ చేతులు అద్భుతాన్ని చేశాయి. ఐస్‌క్రీమ్ పుల్లల సాయంతో నందిని టోక్యో ఒలింపిక్స్‌ స్టేడియం సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించింది....

Published : 26 Jul 2021 02:02 IST

పూరీ: ఒడిశాలోని పూరీకి చెందిన 14 ఏళ్ల బాలిక నందిని పట్నాయక్ చేతులు అద్భుతాన్ని చేశాయి. ఐస్‌క్రీమ్ పుల్లల సాయంతో నందిని టోక్యో ఒలింపిక్స్‌ స్టేడియం సూక్ష్మ కళాఖండాన్ని రూపొందించింది. 8-10 వేల ఐస్‌క్రీమ్ పుల్లల సాయంతో నందిని ఈ మినియేచర్‌ను తయారుచేసింది. ఈ కళాఖండం రూపకల్పనకుగానూ పలువురి నుంచి నందినికి ప్రశంసలందుతున్నాయి. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందానికి ఈ కళాఖండాన్ని అంకితం చేసినట్లు ఆ బాలిక తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని