APSRTC: ఆర్టీసీలో కారుణ్యనియామక ప్రక్రియ పూర్తి.. 294 మందికి ఉద్యోగాలు

ఏపీఎస్‌ ఆర్టీసీలో కారుణ్య నియామక ప్రక్రియ పూర్తయినట్టు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

Published : 21 Jun 2023 21:27 IST

విజయవాడ: ఏపీఎస్‌ ఆర్టీసీలో కారుణ్య నియామక ప్రక్రియ పూర్తయినట్టు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. 2016 జనవరి నుంచి 2019 డిసెంబరు మధ్య కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చినట్టు తెలిపారు. మొత్తం 294 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. 34 జూనియర్‌ అసిస్టెంట్, 99 ఆర్టీసీ కానిస్టేబుల్‌, 99 అసిస్టెంట్‌ మెకానిక్‌, 61 కండక్టర్‌, ఒక డ్రైవర్‌పోస్టును భర్తీ చేసినట్టు వెల్లడించారు. కొత్తగా నియమితులైన ఉద్యోగులకు శిక్షణా తరగతులను ఎండీ ప్రారంభించారు. సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. 3 నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపిన ఆయన శిక్షణా కాలంలో ఉద్యోగులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని