Gold Seize: ప్రొద్దుటూరులో 300 కేజీల బంగారం సీజ్‌

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల త‌నిఖీలు ముగిశాయి. నాలుగు బంగారం దుకాణాల్లో బిల్లులు లేని సుమారు 300 కిలోల‌ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.

Updated : 22 Oct 2023 15:37 IST

ప్రొద్దుటూరు (నేరవార్తలు): వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల త‌నిఖీలు ముగిశాయి. నాలుగు బంగారం దుకాణాల్లో బిల్లులు లేని సుమారు 300 కిలోల‌ బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. విజ‌య‌వాడ‌, తిరుప‌తికి చెందిన ఐటీ అధికారులు గ‌త నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్‌, డైమండ్స్ దుకాణాల‌తో పాటు గురురాఘ‌వేంద్ర, త‌ల్లం దుకాణాల్లో త‌నిఖీలు చేప‌ట్టారు. అనంతరం భారీ ఎత్తున బంగారం సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్‌కేసుల్లో భద్రపరిచి వాహనాల్లో తిరుపతికి తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా భారీ ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.

బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరు రెండో ముంబయిగా ఖ్యాతి గడించింది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారుల నాలుగు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరులో రెండు వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల దుకాణాలు ఉన్నాయి. ఐటీ అధికారుల తనిఖీలతో మిగతా బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. తనిఖీలు తమ వరకు వస్తాయన్న ఆందోళనతో బంగారం, స్వర్ణకారులు దుకాణాలను మూసివేశారు. దసరా పండుగ సమయంలో బంగారం దుకాణాలన్నీ మూత పడటంతో కొనుగోలుకు వచ్చిన వినియోగదారులు నిరాశ చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని