రేపు విద్యాసంస్థలు మూసివేయాలి: కన్నబాబు

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌లో హింసాత్మక ఘటనలకు తావివ్వొద్దని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు విజ్ఞప్తి చేశారు. రైతుల మనోభావాలను గౌరవిస్తున్నట్లు

Published : 07 Dec 2020 22:08 IST

అమరావతి: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌లో హింసాత్మక ఘటనలకు తావివ్వొద్దని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు విజ్ఞప్తి చేశారు. రైతుల మనోభావాలను గౌరవిస్తున్నట్లు ఆయన చెప్పారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటలోపు బంద్‌ను ముగిస్తే బావుంటుందన్నారు. ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులు నడపొద్దని.. ప్రభుత్వ కార్యాలయాలు ఒంటిగంట తర్వాత తెరవాలని సూచించారు. బంద్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూసివేయాలన్నారు. బంద్‌ ప్రశాంతంగా జరిగేలా రైతుల సంఘాలు సహకరించాలని కన్నబాబు కోరారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని