సినిమా థియేటర్లు తెరవాలని కేంద్రానికి వినతి

కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా మూతపడ్డ సినిమా థియేటర్లు ఇంతవరకూ తెరచుకోలేదు. సినిమా పరిశ్రమను నమ్ముకున్నవారు ఉపాధి లేక దాదాపు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల

Published : 15 Sep 2020 22:50 IST

దిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా మూతపడ్డ సినిమా థియేటర్లు ఇంతవరకూ తెరచుకోలేదు. సినిమా పరిశ్రమను నమ్ముకున్నవారు ఉపాధి లేక దాదాపు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమా చిత్రీకరణకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై మాత్రం విముఖత వ్యక్తం చేసింది. అయితే, లక్షల మంది చిరుద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో థియేటర్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతివ్వాలని ఎమ్‌ఏఐ (మల్టీప్లెక్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా) కేంద్రానికి లేఖ రాసింది. ‘కరోనా లాక్‌డౌన్‌ వల్ల దాదాపు రూ.9వేల కోట్లు నష్టం వాటిల్లింది. అన్నింటికంటే ముందు సినిమా థియేటర్లనే మూసేశారు. ప్రస్తుతం అన్ని కార్యాలయాలు, దుకాణాలు, రెస్టారెంట్లు, రైల్వే సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. థియేటర్లు మాత్రం తెరచుకోలేదు. థియేటర్లు మూతపడటం వల్ల నెలకు రూ.1,500కోట్లు నష్టపోవాల్సి వస్తోంది. ప్రపంచంలో 80దేశాలకు పైగా సినిమా థియేటర్లకు అనుమతులిచ్చాయి. లక్షలాది మంది కార్మికుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని థియేటర్ల పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి’ అని ఎంఏఐ కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని