జూమ్ సమావేశాలతో విసుగొస్తుందా?

కరోనా మహమ్మారి దాపురించిన దగ్గరి నుంచి ఇంటి నుంచి పని, ఆన్‌లైన్‌ సమావేశాలు వంటి పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Published : 24 Aug 2020 23:40 IST

ముంబయి: కరోనా మహమ్మారి దాపురించిన దగ్గరి నుంచి ఇంటి వద్ద నుంచే పని, ఆన్‌లైన్‌ సమావేశాలు వంటి పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం జూమ్ వంటి యాప్‌ల వినియోగం ఎక్కువైంది. ఇంటి నుంచి పనిచేస్తూ ఈ సమావేశాలతో  విసుగు చెందిన వారికి ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయంకా ఓ పరిష్కారం చూపించారు. నవ్వులు పూయించే, ఆలోచింపజేసే సందేశాలను ఆయన తరచూ నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో నెటిజన్లను మెప్పించింది. 

‘మీరు నాలాగే జూమ్ సమావేశాలతో విసుగు చెందితే, ఏమి చేయాలో చూడండి. అచ్చంగా మీరే సమావేశంలో పాల్గొని, వింటున్నట్లు ఉన్న ఒక వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్‌ను సిద్ధం చేసుకోండి. ఆ తరవాత మీరు నిద్రపోవడమో, టీవీ చూడటమో చేయొచ్చు’ అని ట్వీట్ చేయడంతో పాటు ఒక వీడియోను జత చేశారు. దానిలో అసలైన వ్యక్తికి వర్చువల్‌గా సిద్ధం చేసిన ఇమేజ్‌ సమావేశంలో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. 

దానిపై నెటిజన్లు స్పందిస్తూ..‘సర్‌ మా రహస్యాలను బయటపెట్టకండి’, ‘వెబ్ కాన్ఫరెన్స్‌ నుంచి బయటపడటానికి ఉపయోగపడే వినూత్నమైన జిమ్మిక్కు’, ‘ప్రశ్నలు అడిగితే ఎలా?’, ‘ఓఎమ్‌జీ, చాలా బాగుంది’ అంటూ ట్వీట్లు చేశారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని