డబుల్ డెక్కర్ జ్ఞాపకాలలో...మంత్రి కేటీఆర్
డబుల్ డెక్కర్ బస్సుల గురించి మీకు తెలుసా! అప్పట్లో ..హైదరాబాద్‌లో నగరంలో ఇవి బహుప్రాచుర్యం పొందాయి. కానీ కాల క్రమేణా కనిపించకుండా పోయాయి. తాజాగా..మంత్రి కేటీఆర్ వీటి గురించి గుర్తుచేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్ : డబుల్ డెక్కర్ బస్సుల గురించి మీకు తెలుసా! అప్పట్లో ..హైదరాబాద్ నగరంలో ఇవి అత్యంత ప్రాచుర్యం పొందాయి. కానీ కాల క్రమేణా కనిపించకుండా పోయాయి. తాజాగా.. మంత్రి కేటీఆర్ వీటి గురించి గుర్తుచేసుకున్నారు. ఆ డబుల్ డెక్కర్ బస్సులతో తనకు ఉన్న అనుభూతులను పంచుకున్నారు. అవకాశం ఉంటే అలాంటి బస్సులను తిరిగి ప్రారంభించాలన్నారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రిని కోరారు.
గతంలో 7Z డబుల్ డెక్కర్ ఆర్టీసీ బస్సు ప్రయాణికులను అప్జల్ గంజ్ నుంచి జూపార్క్ వరకు తీసుకెళ్లేదని కేటీఆర్ పేర్కొన్నారు. బస్సులోంచి వారు నగర అందాలను వీక్షిస్తూ మైమరిచి పోయేవారని గుర్తుచేసుకున్నారు. గత స్మృతులను తలచుకుంటూ.. నాటి డబుల్ డెక్కర్ బస్సులకు సంబంధించిన ఫొటోనూ జతచేస్తూ ఓ వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై ఆయన స్పందించారు. తనకు కూడా ఆ మధుర జ్ఞాపకాలు ఉన్నాయని.. అబిడ్స్‌లోని పాఠశాలలో చదివిన రోజులను గుర్తుచేసుకుంటూ రీట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఏమాత్రం అవకాశం ఉన్నా.. ప్రస్తుత హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను నడిపేలా ఆర్టీసీకి సూచిస్తానని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్‌రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్‌లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?