రష్యాలో రాజ్‌నాథ్‌ నమస్కారం.. వీడియో వైరల్‌

ఓ కీలక సమావేశంలో పాల్గొనేందుకు రష్యా చేరుకున్న  రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌.. అటు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా, ఇటు కరోనా నేపథ్యంలో భౌతికదూరం నిబంధనలకు..........

Published : 04 Sep 2020 01:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఓ కీలక సమావేశంలో పాల్గొనేందుకు రష్యా చేరుకున్న  రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌.. అటు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా, ఇటు కరోనా నేపథ్యంలో భౌతికదూరం నిబంధనలకు అనుగుణంగా అక్కడి వారికి నమస్కారంతో పలకరించారు. కీలక షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) సమావేశానికి భారతదేశం తరపున రాజ్‌నాధ్‌ సింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రష్యాను చేరుకున్న మంత్రికి రష్యన్‌ మేజర్‌ జనరల్‌ బుక్తీవ్‌ యూరీ నికోలేవిచ్‌ తదితర ఉన్నతాధికారులు మాస్కో విమానాశ్రయం వద్ద స్వాగతం పలికారు. ఓ అత్యున్నత రష్యన్ ఆర్మీ అధికారి ఆయనకు సెల్యూట్‌తో స్వాగతం చెప్పగా.. అందుకు మన రక్షణ మంత్రి భారతీయ సంప్రదాయ పద్ధతిలో ‘నమస్తే’తో ప్రతిస్పందించారు. రష్యన్‌ బృందంలో ఒకరు షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించినా.. రాజ్‌నాథ్ సింగ్ మాత్రం‌ నమస్కారం చేశారు.  

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రాజ్‌నాథ్‌ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో నిన్న షేర్‌ చేస్తూ.. ‘‘నిన్న సాయంత్రం మాస్కో చేరుకున్నాను. రష్యన్‌ ప్రతినిధి జనరల్‌ సెర్గేయ్‌ షోయ్‌గూతో రేపు జరగనున్న కోసం ద్వైపాక్షిక సమావేశం కోసం వేచిచూస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. దీన్ని పోస్ట్‌ చేసిన 12 గంటలు గడవక ముందే ఒకటిన్నర లక్షలకు పైగా వ్యూస్‌ను స్వంతం చేసుకోవటం గమనార్హం. ఎస్‌సీఓలో భారత్‌తో సహా.. చైనా, కజకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, పాకిస్థాన్‌, రష్యా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశాధినేతలతో సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రాచీన భారతీయ విధానమైన నమస్కారాన్ని అనుసరిస్తున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని