యానాంలో టోర్నడో బీభత్సం

తూర్పుగోదావరి జిల్లా యానాంలో టోర్నడో బీభత్సం సృష్టించింది.

Published : 17 Jul 2020 20:46 IST

యానాం: తూర్పుగోదావరి జిల్లా యానాంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. నియోజకవర్గంలోని అయ్యన్ననగర్‌ లంకలో మొదలైన సుడిగాలి క్రమేపి బలం పుంజుకొని ఇరవై నిమిషాలపాటు రొయ్యల చెరువుల్లో అలజడి సృష్టించింది.  సుడిగాలి దాటికి సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రొయ్యల చెరువుల్లో నీరు ఏనుగు తొండం తరహాలో మేఘాల్లోకి వెళ్లిపోయింది. నీటితోపాటు ఆ చెరువుల్లోని రొయ్యలు, చిన్న చిన్న మోటార్ ఇంజన్‌లు, వాటి తీగలు ఆ సుడిలోకి వెళ్లి దూరంగా ఇతర ప్రాంతాల్లో చెల్లాచెదురై పడ్డాయి. 
అయ్యన్ననగర్ గ్రామం మీదుగా వెళ్తూ సుడిగాలి బలహీనపడింది . ఈ క్రమంలో కొన్ని ఇళ్ల పైన నిర్మించిన రేకుల షెడ్లు కూలిపోయాయి. కొన్ని చెట్లు కిందపడ్డాయి. దీనివల్ల జరిగిన నష్టాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. డిప్యూటీ తహసీల్దార్ జి.సత్యనారాయణ, తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని