వాయుగుండంగా తీవ్ర అల్పపీడనం

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Published : 21 Aug 2020 02:24 IST

హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్ప పీడనం ప్రభావం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై అధికంగా కనిపిస్తున్నట్లు తెలిపింది. దీంతో పలు చోట్ల ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండలా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.

ఆదిలాబాద్‌, నిర్మల్‌, కొమురంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జనగామ, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 23వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని