పొలంలో వినాయకుని రూపం..ఎలాగో చూడండి

మాయదారి కరోనా మనిషి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపింది. శుభకార్యాల దగ్గర నుంచి సంప్రదాయంగా జరుపుకునే పండగల వరకు ప్రతి వేడుకకు ఆటంకమే. ఈ మహమ్మారి కారణంగా ప్రతి ఏడాది....

Published : 21 Aug 2020 23:52 IST

ముంబయి: మాయదారి కరోనా మనిషి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపింది. శుభకార్యాల దగ్గర నుంచి సంప్రదాయంగా జరుపుకొనే పండగల వరకు ప్రతి వేడుకకు ఆటంకమే. ఈ మహమ్మారి కారణంగా ప్రతి ఏడాది చిన్నా పెద్దా అంతా ఒక్కచోట చేరి ఎంతో వేడుకగా చేసుకునే వినాయకుడి ఉత్సవాలు కూడా ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. మరోవైపు ప్రజలంతా మట్టి విగ్రహాలను ఆరాధించాలని పర్యవరణవేత్తలు సూచిస్తున్నారు. దీంతో మట్టితో చేసిన వినాయకుల వైపే ఎంతో మంది మొగ్గు చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని షోలాపూర్‌ దగ్గర్లోని బాలా గ్రామానికి చెందిన ప్రతీక్‌ తండాలే అనే యువ ఆర్టిస్ట్ విన్నూత్నంగా ఆలోచించాడు. పండుగకు కొద్ది రోజుల ముందుగా పొలంలో తన స్నేహితుల సహాయంతో వినాయకుడిని రూపాన్ని గీసి, అందులో విత్తనాలను చల్లి పంట పండించాడు. 200 అడుగుల పొడువు, 100 అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ ఎకోఫ్రెండ్లీ వినాయకుడు చూసిన వారంతా ప్రతీక్‌ ఆలోచనను అభినందిస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

దీని గురించి ప్రతీక్‌ మాట్లాడుతూ‘‘ కరోనా కారణంగా ప్రతి ఏడాదిలా వినాయకచవితిని జరుపుకోలేకపోతున్నాం. భౌతిక దూరం, ఎక్కువ మంది ఒక చోట చేరకూడదు లాంటి ఎన్నో నిబంధనలు పాటించాలి. అందుకే ఎక్కువ మంది ఒక చోటకి రాకుండా, దూరం నుంచి చూసినా కనిపించేలా ఏదైనా చేయాలనుకున్నాను. పంటతో వినాయకుడిని రూపొందించాలని నిర్ణయించుకుని మిత్రుల సహకారం తీసుకున్నాను. సుమారు 45 రోజుల పాటు శ్రమించి మేమంతా ఈ ఎకోఫ్రెండ్లీ వినాయకుడిని రూపొందించాం. మొదటి రెండు ఫలితాల్లో మేం అనుకున్నది సాధించలేకపోయాం. మూడో ప్రయత్నంలో విజయం సాధించాం’’ అని తెలిపాడు. ప్రతీక్‌, అతడి మిత్రులు కలిసి రూపొందించిన ఈ ఎకోఫ్రెండ్లీ వినాయకుడిని చూసిన నెటిజన్లు వారిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు