Top Ten News @ 1 PM

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజూ 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,03,738 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇక మరణాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటున్నాయి. నిన్న ఒక్క రోజే 4,092 మంది

Updated : 09 May 2021 13:01 IST

1. Corona: నాలుగో రోజూ 4 లక్షలకుపైనే కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజూ 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,03,738 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  ఇక మరణాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటున్నాయి. నిన్న ఒక్క రోజే 4,092 మంది వైరస్‌కు బలయ్యారు. తాజా కేసులతో కలిసి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,22,96,414కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Covid: 40% జిల్లాల్లో 20% పాజిటివిటీ రేటు

2. ట్రంప్‌కు వాడిన ఔషధానికి భారత్‌లో గ్రీన్‌సిగ్నల్‌!

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నికల సమయంలో కరోనా బారిన పడటంతో ఒక యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని వాడారు. ఆ తర్వాత ఆయన వేగంగా కోలుకున్నారు. తాజాగా ఇప్పుడు ఆ ఔషధం భారత్‌లో అందుబాటులోకి రానుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ రోచ్‌కు  భారత్‌లోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి అనుమతులు లభించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. china rocket: హమ్మయ్య.. ముప్పు తప్పింది!

గత కొన్ని రోజులుగా యావత్తు ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలాయి. దీంతో భూమిపై పడనున్నాయన్న భయాందోళనలకు తెరపడింది. భూ వాతావరణంలోకి రాగానే చాలా వరకు శకలాలు పూర్తిగా భస్మమయ్యాయి. కేవలం కొన్ని చిన్న చిన్న భాగాలు మాత్రమే సముద్రంలో పడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. Lockdown : దిల్లీలో మరో వారం పొడిగింపు

కరోనా మహమ్మారి దేశ రాజధాని దిల్లీని అతలాకుతలం చేస్తోంది. కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో.. ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మరో వారం పాటు కేజ్రీవాల్‌ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల17 వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఈసారి లాక్‌డౌన్‌ మరింత కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. మెట్రోసేవలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. Corona: పంచాయతీలకు కేంద్ర నిధులు

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 25 రాష్ట్రాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి  శాఖ నుంచి రూ. 8,923.8కోట్లు విడుదలయ్యాయి. వీటిలో ఏపీకి రూ.387.8కోట్లు, తెలంగాణకు రూ.273కోట్లు వచ్చాయి.  కరోనా తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థలకు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

6.  పేలుడుపై ఉన్నతస్థాయి విచారణ: పెద్దిరెడ్డి

క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే కడప జిల్లాలోని మామిళ్లపల్లె క్వారీలో పేలుడు సంభవించిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఐదు ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఐదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందుతుందన్నారు. తక్షణ పరిహారంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. Assam:సీఎం అభ్యర్థిని ఖరారు చేసిన భాజపా

అస్సాం సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై  ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మను భాజపా అధిష్ఠానం సీఎం అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇప్పటికే గువహటిలో అస్సాం భాజపా శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా హిమంతను ఎన్నుకోనున్నారు. త్వరలో సీఎంగా ఆయన  ప్రమాణస్వీకారం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. VijayDeverakonda: ఓవర్‌నైట్‌ స్టార్‌ కాదు

‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగాక గుర్తించనవసరం లేదు’ ఖలేజా చిత్రంలోని ఈ డైలాగ్‌ యువ నటుడు విజయ్‌ దేవరకొండ విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. విజయ్‌ సినీ కెరీర్‌లో జరిగిన ఆ అద్భుతమే ‘అర్జున్‌ రెడ్డి’. ఈ సినిమా విజయ్‌ని యూత్‌ ఐకాన్‌గా నిలబెట్టి, ఓ తరాన్ని ప్రభావితం చేయగలిగే ఆత్మ విశ్వాసాన్నిచ్చింది. ఇదంతా ఒక్క రాత్రిలో సాధ్యమైంది కాదు. దాని వెనక ఎన్నో కష్టాలున్నాయి. మే 9 విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 

* Vijay Deverakonda: ఫ్యాన్స్‌కు నిరాశ

9. భారత్‌కు అమెరికా కార్పొరేట్‌ అండ

భారత్‌కు విదేశాల నుంచి కొవిడ్‌ సాయం కొనసాగుతోంది. అమెరికా కార్పొరేట్‌ రంగం మరింతగా వైద్య సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. అధిక సంఖ్యలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పంపుతోంది. ‘‘భారత్‌లోని మా సహచరుల కోసం, ప్రజల కోసం యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ద్వారా అత్యవసర వైద్య అవసరాలను పంపుతున్నాం’’ అని థర్మో ఫిషర్‌ సంస్థ పేర్కొంది. వైరస్‌ను అడ్డుకునేందుకు ఉపయోగపడే 4.6 మిలియన్ల వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం ట్యూబులను పంపినట్టు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. గిల్‌కు 21 ఏళ్లే.. ప్రశాంతంగా ఉండాలి: గావస్కర్‌

టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ ఇంకా 21 ఏళ్ల కుర్రాడని, ప్రశాంతంగా ఉంటూనే వైఫల్యాల నుంచి నేర్చుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 440 పరుగులు చేసిన అతడు ఈసారి టోర్నీ వాయిదా పడకముందు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 132 పరుగులే చేశాడు. దాంతో అతడిపై ఒత్తిడి పెరిగిందని గావస్కర్‌ ఓ క్రీడా ఛానల్‌తో అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని