Andhra News: కనీస వేతనం అమలు చేయండి.. విశాఖలో అంగన్వాడీల నిరసన హోరు

కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌తో విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

Published : 07 Mar 2022 13:29 IST

విశాఖ: కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌తో విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖ సరస్వతి పార్కు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని వారు తప్పుబట్టారు.

తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తానని పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌ చెప్పారని అంగన్వాడీలు గుర్తు చేశారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని.. తక్షణం ప్రభుత్వం స్పందించి వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని