
AP News: ఏపీలో రాత్రి కర్ఫ్యూ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
అమరావతి: రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో ఇవాళ్టి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ్టి నుంచి జనవరి 31వ తేదీ వరకు రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ నిబంధనల నుంచి ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, వైద్యులు, మెడికల్ సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్లు, పెట్రోలు బంకులు, ఐటీ సేవలు, అత్యవసర సేవల సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు.
వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న రోగులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారికి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. మరో వైపు కొవిడ్ నియంత్రణా చర్యల్లో భాగంగా కర్ఫ్యూ అమలు కాని సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్ వేదికల్లో 100మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లో కొవిడ్ నిబంధనల ఉల్లంఘన జరిగితే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.