Andhra News: మహిళా రక్షణ కార్యదర్శులను.. పోలీసులుగా ఎలా మారుస్తారు?:హైకోర్టు

మహిళా రక్షణ కార్యదర్శులను.. మహిళా పోలీసులుగా ప్రభుత్వం మార్చడానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.

Updated : 23 Feb 2022 22:04 IST

అమరావతి: మహిళా రక్షణ కార్యదర్శులను.. మహిళా పోలీసులుగా ప్రభుత్వం మార్చడానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. మహిళా రక్షణ కార్యదర్శులను పోలీసులుగా తీసుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం విరుద్ధమంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, వై బాలజీ వాదనలు వినిపించారు. పోలీసు యాక్ట్ ప్రకారం కూడా విరుద్ధమని వాదించారు. ఓ పోస్టు కోసం భర్తీ చేసుకున్నవారిని మరో పోస్టులో ఎలా నియమిస్తారంటూ ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పోలీసు నిబంధనల ప్రకారం ఫిజికల్ ఫిట్‌నెస్, శిక్షణ లాంటి అంశాలను ప్రస్తావించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం సిద్ధమైన నేపథ్యంలో.. తాము దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను పరిశీలించాల్సిందిగా ధర్మాసనాన్ని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని