Ap High court: ‘ఉచిత ఇసుక’ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది.

Published : 20 Dec 2023 16:34 IST

అమరావతి: ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సీఐడీ, చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో పిటిషన్‌పై తీర్పును ధర్మాసనం రిజర్వ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని