DSC: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ: మంత్రి బొత్స

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Published : 11 Jul 2023 21:44 IST

విజయనగరం గ్రామీణం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి వద్ద ఉందని చెప్పారు. మంగళవారం విజయనగరం జిల్లా రాజాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇష్టానుసారంగా మాట్లాడవద్దని హితవు పలికారు. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు భవిష్యత్తులో చేయవద్దని కోరారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలని, నిర్మాణాలు పూర్తి చేసిన వాటిని వెంటనే అప్పగించాలని గుత్తేదారులకు సూచించారు. నిర్మాణాలు పూర్తి చేసిన గుత్తేదారులకు బిల్లులు తప్పనిసరిగా ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని