ఏపీ పోలీస్‌కు జాతీయ పురస్కారం

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖకు జాతీయస్థాయి పురస్కారం దక్కింది. ఇంటర్‌ అపెరబుల్‌ క్రిమినల్ జస్టిస్‌ సిస్టం(ఐసీజేఎస్‌) అమలు, వినియోగంలో

Updated : 30 Aug 2022 14:16 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖకు జాతీయస్థాయి పురస్కారం దక్కింది. ఇంటర్‌ అపెరబుల్‌ క్రిమినల్ జస్టిస్‌ సిస్టం(ఐసీజేఎస్‌) అమలు, వినియోగంలో ఏపీ పోలీస్‌శాఖ మంచి పనితీరు కనబరిచి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐసీజేఎస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం అవార్డులను ప్రకటించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా వర్చువల్‌ విధానంలో డీజీపీ గౌతం సవాంగ్ అవార్డును అందుకున్నారు. ఏపీ పోలీస్‌ శాఖకు ప్రతిష్ఠాత్మకమైన జాతీయ పురస్కారం దక్కడంతో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి, హోంమంత్రి మేకతోటి సూచరిత హర్షం వ్యక్తం చేశారు. కాగా ఐసీజేఎస్‌ అమలు, వినియోగంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ మూడో స్థానాన్ని  కైవసం చేసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని