PRC : చర్చలకు మేం సిద్ధమే.. మాటలతో రాకుండా చేస్తున్నారు: సూర్యనారాయణ

తమతో చర్చలకు ప్రభుత్వం ఓపెన్‌ మైండ్‌తో లేదని పీఆర్సీ సాధన సమితి నేత 

Published : 29 Jan 2022 02:01 IST

అమరావతి: తమతో చర్చలకు ప్రభుత్వం ఓపెన్‌ మైండ్‌తో లేదని పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి తాము సిద్ధమని తెలిపారు. మాటల ద్వారా మమ్మల్ని చర్చలకు రాకుండా చేస్తున్నారని చెప్పారు. చర్చలకు ముందు ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. కాగితాలపై పుట్టిన సంఘాలతో చర్చించి న్యాయం చేసినా మంచిదేనని వ్యాఖ్యానించారు. సమస్యలపై తాము ఇప్పటికే వందల దరఖాస్తులు ఇచ్చామని గుర్తు చేశారు. తాము ఇచ్చిన 859 అభ్యర్థనలు పెండింగ్‌ ఉన్నాయని సీఎస్ చెప్పారని సూర్యనారాయణ పేర్కొన్నారు.

పాత జీతాలనే ఇవ్వాలి: బొప్పరాజు

ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మరో నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. మూడు డిమాండ్లపై లేఖ ఇచ్చి పరిష్కరించాలని కోరామన్నారు. చర్చలకు వచ్చినప్పుడల్లా మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పారు. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలను ఇలా అవమానించడాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాత జీతాలనే ఇవ్వాలని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని