బియ్యం గింజ పరిమాణంలో గణనాథుడు

జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌ ఆవగింజ పరిమాణంలో బంగారంతో బొజ్జ గణపయ్యను తయారు చేసి ఔరా అనిపించారు.

Published : 24 Aug 2020 23:25 IST

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు

జగిత్యాల: జగిత్యాలకు చెందిన కళాకారుడు గుర్రం దయాకర్‌ ఆవగింజ పరిమాణంలో బంగారంతో బొజ్జ గణపయ్యను తయారు చేసి ఔరా అనిపించారు. బియ్యం గింజ సైజులోనూ గణనాథుడిని రూపొందించగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఆయనకు చోటు దక్కింది. జాతీయ స్థాయిలో గుర్గింపు దక్కడం ఆనందంగా ఉందని దయాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకించి రెండు విగ్రహాలను తయారు చేసినట్లు ఆయన తెలిపారు. అత్యంత సూక్ష్మమైన ఒక బంగారు విగ్రహం తయారు చేసినట్లు చెప్పారు. 0.19మిల్లీ గ్రాములు బరువుతో దీన్ని రూపొందించినట్లు వివరించారు. దీని బంగారం విలువ కేవలం రూ.100గా తెలిపారు. ఈ విగ్రహానికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కిందని వివరించారు. బియ్యం గింజకన్నా తక్కువ సైజులో మరో విగ్రహం తయారు చేసినట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని