Telangana News: 19 లక్షల రేషన్‌కార్డుల రద్దుపై దర్యాప్తు చేయండి: ఎన్‌హెచ్‌ఆర్‌సీకి బండి సంజయ్‌ ఫిర్యాదు

తెలంగాణలో రేషన్‌కార్డులను రద్దు చేయడం, కొత్తవి మంజూరు చేయకపోవడంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ (NHRC)కు భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ ఫిర్యాదు చేశారు.

Published : 26 Jun 2022 13:40 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రేషన్‌కార్డులను రద్దు చేయడం, కొత్తవి మంజూరు చేయకపోవడంపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ (NHRC)కు భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ ఫిర్యాదు చేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రద్దు చేసిన 19 లక్షల రేషన్‌కార్డులు, కొత్త రేషన్‌కార్డుల మంజూరుపై విధించిన నిబంధనలపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు తెరాస ప్రభుత్వం.. 19 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి ప్రస్తుతం 7 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. జూన్‌ 2021 నుంచి కొత్తరేషన్‌కార్డుల దరఖాస్తులను మీ సేవ సెంటర్లు ఆమోదించడం లేదని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి బండి సంజయ్‌ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని