ఉస్మానియా ఆస్పత్రికి అఖిలప్రియ

మియాపూర్‌ సమీపంలోని హఫీజ్‌పేటలో భూ వివాదం, కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైద్య పరీక్షల కోసం పోలీసులు

Published : 10 Jan 2021 01:35 IST

హైదరాబాద్‌: మియాపూర్‌ సమీపంలోని హఫీజ్‌పేటలో భూ వివాదం, కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైద్య పరీక్షల కోసం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం బాగాలేదని.. ఆస్పత్రిలో చూపించాలని అఖిలప్రియ జైలు అధికారులను కోరడంతో మధ్యాహ్నం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమెకు సీటీ స్కాన్‌, ఇతర వైద్య పరీక్షలు చేశారు. అనంతరం చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. నిన్న సికింద్రబాద్‌ కోర్టు కూడా అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.

కిడ్నాప్‌ కేసులో ప్రస్తుతం అఖిలప్రియ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. భూ వివాదం నేపథ్యంలో ప్రవీణ్‌రావు, సునీల్‌ రావు, నవీన్‌ రావు అనే ముగ్గురు సోదరులను కిడ్నాప్‌ చేసిన కేసులో అఖిలప్రియతోపాటు, ఆమె భర్త భార్గవరామ్‌,తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు రెండు రోజుల క్రితం కూకట్‌పల్లిలోని తన నివాసంలో అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

ఇదీ చదవండి.. 

పథకం వేసింది అఖిలప్రియ అమలుచేసింది భార్గవరామ్‌
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని