Srisailam: శ్రీశైలం అన్నపూర్ణ భవన్‌లో పేలిన బాయిలర్‌

శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో ప్రమాదం జరిగింది. భక్తులకు భోజనం, అల్పాహారం తయారీకి వినియోగించే వంటగదిలో బాయిలర్‌ పేలింది.

Published : 01 Nov 2022 10:45 IST

శ్రీశైలం ఆలయం: శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్‌లో ప్రమాదం జరిగింది. భక్తులకు భోజనం, అల్పాహారం తయారీకి వినియోగించే వంటగదిలో బాయిలర్‌ పేలింది. పేలుడు ధాటికి బాయిలర్‌లోని ఎస్‌ఎస్‌ ట్యాంక్, అక్కడ ఉన్న సామగ్రి ఎగిరిపడ్డాయి. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆలయ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాయిలర్‌ పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని