Bhaskar Reddy: భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ బెయిల్‌ నవంబరు 10 వరకు పొడిగించిన సీబీఐ కోర్టు

భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ బెయిల్‌ను నవంబరు 10 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 31 Oct 2023 19:53 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ బెయిల్‌ను నవంబరు 10 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్కార్ట్‌ బెయిల్‌ మరో రెండు నెలలు పొడిగించాలని కోరతూ భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. వైద్యుడు లేకపోవడంతో అక్టోబరు 18న చికిత్స జరగలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఎస్కార్ట్‌ బెయిల్‌ పొడిగింపు కోసం ఏదో ఒక కారణం చూపుతున్నారని సీబీఐ అభ్యంతరం తెలిపింది. భాస్కర్‌రెడ్డి ఆరోగ్యంపై వాస్తవాలు తేల్చేందుకు ఇద్దరు వైద్యులతో మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డీఎంఈకి సీబీఐ కోర్టు ఆదేశించింది. ఎస్కార్ట్‌ బెయిల్‌ను నవంబరు 10 వరకు పొడిగిస్తూ.. పిటిషన్‌పై తదుపరి విచారణ నవంబరు 8కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని