సీబీఎస్‌ఈ పరీక్షలు: ఆ వార్తలు నిజం కాదు! 

సీబీఎస్‌ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కుల శాతాన్ని కుదించినట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆన్‌లైన్‌లో వ్యాప్తి అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్రం కొట్టిపారేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీ ‘పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌’ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

Updated : 21 Jan 2021 04:27 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కుల శాతాన్ని కుదించినట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆన్‌లైన్‌లో వ్యాప్తి అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్రం కొట్టిపారేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీ ‘పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌’ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ‘సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను 33శాతం నుంచి 23శాతానికి కుదించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌లో ఉన్న సమాచారం నిజం కాదు. ఉత్తీర్ణత మార్కులకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు’ అని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ స్పష్టం చేసింది.

సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్‌ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను 33శాతం నుంచి 23శాతానికి కుదిస్తూ కేంద్ర విద్యాశాఖ ప్రకటించిందనేది ఆ పోస్ట్‌ సారాంశం. ఆ పోస్ట్‌లోని ఫొటోలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను కూడా జత చేశారు. దీంతో దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు స్పష్టత కోసం కేంద్ర విద్యాశాఖను సంప్రదించడం ప్రారంభించడం గమనార్హం.

కాగా సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మే 4 నుంచి ప్రారంభమవుతాయని పోఖ్రియాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సీబీఎస్‌ఈ పరీక్షలు తగ్గించిన సిలబస్‌తోనే ఉంటాయని ఇటీవల కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. 

ఇదీ చదవండి

బైడెన్‌ ప్రమాణస్వీకారం.. ఆసక్తికర విషయాలు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని