KCR - Chandrababu: కేసీఆర్‌ను పరామర్శించనున్న చంద్రబాబు

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (KCR) తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) పరామర్శించనున్నారు.

Updated : 11 Dec 2023 15:41 IST

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (KCR) తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) పరామర్శించనున్నారు. ఆయన చికిత్స పొందుతున్న హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి కాసేపట్లో వెళ్లనున్నారు. గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో కేసీఆర్‌ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని