AP News: వైఎస్ఆర్ బీమా ప‌థ‌కంలో మార్పులు

కుటుంబంలో సంపాదించే వ్యక్తి మ‌ర‌ణిస్తే ఆ కుటుంబాన్నిస‌త్వ‌ర‌మే ఆదుకునేలా వైఎస్ఆర్ బీమాలో రాష్ట్ర ప్ర‌భుత్వం మార్పులు చేసింది. బీమాకు సంబంధించిన క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో చిక్కుముడుల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని

Published : 09 Jun 2021 14:23 IST

బాధిత కుటుంబాన్ని స‌త్వ‌ర‌మే ఆదుకునేలా చ‌ర్య‌లు

జులై 1 నుంచి అమ‌ల్లోకి స‌వ‌రించిన మార్పులు

అమ‌రావ‌తి: కుటుంబంలో సంపాదించే వ్యక్తి మ‌ర‌ణిస్తే ఆ కుటుంబాన్నిస‌త్వ‌ర‌మే ఆదుకునేలా వైఎస్ఆర్ బీమాలో రాష్ట్ర ప్ర‌భుత్వం మార్పులు చేసింది. బీమాకు సంబంధించిన క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో చిక్కుముడుల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని నిర్ణ‌యించింది. వైఎస్ఆర్ బీమాపై స‌మీక్ష సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ మేర‌కు మ‌ర‌ణించిన వ్య‌క్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి సాయం అంద‌నుంది. కుటుంబంలో సంపాదిస్తున్న 18 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వ్య‌క్తి స‌హ‌జంగా మ‌ర‌ణిస్తే రూ.1 ల‌క్ష ఆర్థిక సాయం అందించ‌నున్నారు. అదే.. సంపాదిస్తున్న వ్య‌క్తి వ‌య‌సు 18 నుంచి 70 ఏళ్ల మ‌ధ్య ఉండి.. ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే రూ.5 ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం చేయ‌నున్నారు.

వైఎస్ఆర్ బీమా ప‌థ‌కంలో చేసిన మార్పులు జులై 1 నుంచి అమ‌ల్లోకి రానుంది. ఈ లోగా కుటుంబాల్లో సంపాదించే వ్యక్తుల మ‌ర‌ణాల‌కు సంబంధించిన వారి క్లెయిమ్‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌కు ఆదేశించారు. రైతు ఆత్మ‌హ‌త్య‌లు, ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌త్స్య‌కారుల మ‌రణించినా, పాడిప‌శువులు మృత్యువాత ప‌డినా త‌దిత‌రాల‌కు ఇచ్చే బీమా ప‌రిహారాల‌న్నీ ద‌ర‌ఖాస్తు అందిన నెల రోజుల్లోగా చెల్లించాల‌ని సీఎం ఆదేశించారు. ఈ ప్ర‌క్రియ కోసం ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని