యాదాద్రి: రెండున్నర నెలల్లో అన్ని పనులు పూర్తి చేయాలి

టెంపుల్‌ టౌన్‌ యాదగిరిగుట్టలో జరుగుతున్న నిర్మాణ పనులన్నింటినీ రెండున్నర నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వరంగల్‌ పర్యటన ముగించుకుని వస్తూ మార్గం మధ్యలో ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చారు. ముందుగా

Updated : 22 Jun 2021 10:57 IST

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

యాదాద్రి: టెంపుల్‌ టౌన్‌ యాదగిరిగుట్టలో జరుగుతున్న నిర్మాణ పనులన్నింటినీ రెండున్నర నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వరంగల్‌ పర్యటన ముగించుకుని వస్తూ మార్గం మధ్యలో ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చారు. ముందుగా సీఎం ఆలయ రింగ్‌రోడ్‌ చుట్టూ పర్యటించి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వవచనం తీసుకున్నారు. ఈవో కార్యాలయంలో ఆలయ అధికారులతో సమావేశమై ఆలయం బయట, లోపల జరుగుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. అన్నిరకాల పనులను సమాంతరంగా కొనసాగించాలని, కాటేజీల నిర్మాణానికి వైటీడీఏ ఆధ్వర్యంలో టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. రింగ్‌రోడ్‌ పరిధిలోని భూములపై డీజీపీఎస్‌ సర్వే చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. యాదగిరిగుట్టలో బస్‌స్టాండ్‌, బస్‌డిపో నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. వారంలోగా నిర్మాణ పనులను ప్రారంభించాలని, 3 నెలల్లోగా బస్టాండ్‌ నిర్మాణ పనులు పూర్తి కావాలని సీఎం ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని