CM Kcr: దసరా రోజు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలి: సీఎం కేసీఆర్‌

తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడవాలని.. విజయానికి సంకేతమైన దసరా రోజు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రార్థించారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

Published : 05 Oct 2022 01:56 IST

హైదరాబాద్‌: తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడవాలని.. విజయానికి సంకేతమైన దసరా రోజు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రార్థించారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ధర్మస్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయదశమిగా దసరా పండుగను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారని సీఎం అన్నారు. దసరా రోజున శుభసూచికంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సంప్రదాయం గొప్పదని తెలిపారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్‌ బలయ్‌ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనతి కాలంలోనే అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు. విజయదశమి స్ఫూర్తిని కొనసాగిస్తామన్న కేసీఆర్‌.. ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని