CM Revanth Reddy: ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Published : 06 Mar 2024 15:55 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. 

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రియల్‌ టైంలో రైతు సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక క్లస్టర్ చొప్పున ఎంపిక చేసిన ప్రభుత్వం.. త్వరలో దశల వారీగా మొత్తం 2,601 క్లస్టర్ల పరిధిలో ఉన్న రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పించనుంది. ఇందుకోసం రూ.100 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయ విస్తరణ సేవలతోపాటు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని