Covid update: తెలంగాణలో మరోసారి కరోనా విజృంభణ

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా  పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 27,754 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. కరోనా

Published : 22 Jun 2022 20:06 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా  పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 27,754 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి ఈరోజు 129 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,680 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 292 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ప్రకటించడంతో కొన్ని పాఠశాలల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారు. హైదరాబాద్‌ గన్‌పౌండ్రీలోని మహబుబియా పాఠశాలలో విద్యార్థులు మాస్క్‌లు ధరించి తరగతులకు హాజరయ్యారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

దేశంలో ఇవాళ కొత్తగా 12,200లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 13 మరణాలు సంభవించాయి. తాజాగా మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ  వంటి మరికొందరు ప్రముఖులు కొవిడ్‌ బారిన పడటంతో మరోసారి కలవరం మొదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని