Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 06 May 2024 21:00 IST

1. జగన్‌ ఉత్తరాంధ్ర ద్రోహి.. ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

ఎన్డీయే గెలుపును ఎవరూ ఆపలేరని, అవినీతి వైకాపా ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఉందని విర్రవీగిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. 2047లో వికసిత్‌ భారత్‌.. మోదీ లక్ష్యమైతే.. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌.. తన లక్ష్యమన్నారు. అనకాపల్లిలోని రాజుపాలెంలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. అధికారుల తప్పిదం.. ఆందోళనలో 1,219 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో గందరగోళం తలెత్తింది. అధికారుల తప్పిదం కారణంగా 1219 మంది ఉద్యోగుల ఓట్లు ప్రశ్నార్థకంగా మారాయి. నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను ఆదివారం నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ఖలిస్థానీ అనుకూల గ్రూపుల నుంచి నిధుల స్వీకరణ.. కేజ్రీవాల్‌పై ఎన్‌ఐఏ దర్యాప్తు..!

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై మరో దర్యాప్తు మొదలయ్యే అవకాశం ఉంది. ఖలిస్థానీ అనుకూల గ్రూపు ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నుంచి ఆప్‌ నిధులను స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్పందించారు. ఈ అంశంపై ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని ఆయన సిఫార్స్‌ చేశారు. ఈ ఆరోపణలను ఆప్‌ తోసిపుచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఇరాన్‌లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్‌కు చేరుకొన్న మత్స్యకారులు..!

ఆరుగురు భారతీయులతో ప్రయాణిస్తున్న ఇరాన్‌కు చెందిన చేపలవేట పడవను కోస్ట్‌గార్డ్‌ అదుపులోకి తీసుకొంది. ఈ మత్స్యకారులు తమిళనాడుకు చెందిన కన్యాకుమారి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వీరంతా ఇరాన్‌కు చెందిన సయ్యద్‌ సౌదీ అన్సారీ అనే వ్యక్తి వద్ద కాంట్రాక్టుపై పని చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టు నుంచి 4జీ సేవలు

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) 4జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర భారత్‌’ అడుగులకు అనుగుణంగా దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో ఈ సేవలను తీసుకొస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. రఫాపై ఇజ్రాయెల్‌ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!

ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel) మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలమైన తరుణంలో భారీ దాడులకు ఐడీఎఫ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రఫాపై ఇప్పటికే దండయాత్ర మొదలు పెట్టినట్లు స్థానికులు వెల్లడించారు. సుమారు లక్ష మంది పాలస్తీనా వాసులు రఫా నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్‌ దళాలు దాడులు ప్రారంభించడం గమనార్హం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7.  వైకాపాది అవినీతి మంత్రం.. ఎన్డీయేది అభివృద్ధి మంత్రం: ప్రధాని మోదీ

వైకాపాది అవినీతి మంత్రం అయితే.. ఎన్డీయేది అభివృద్ధి మంత్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అనకాపల్లి జిల్లా రాజుపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో శాండ్‌, ల్యాండ్‌, మద్యం మాఫియా పాలన సాగుతోందని, ఈ దోపిడీ నుంచి విముక్తి కల్పించేందుకు ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదిగిందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. రామమందిర తీర్పును మార్చేందుకు రాహుల్‌ యత్నం: కాంగ్రెస్‌ బహిష్కృత నేత ఆరోపణలు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై ఆ పార్టీ నుంచి బహిష్కరించబడిన నేత సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే సుప్రీంతీర్పును మార్చేందుకు ఆయన ప్రయత్నిస్తారని ఆచార్య ప్రమోద్‌ కృష్ణం వెల్లడించారు. ‘‘నేను దాదాపు 32 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశాను. ఒకసారి రాహుల్‌ తన సహాయకులతో సమావేశమైన సందర్భంగా రామమందిర అంశం చర్చకు వచ్చింది’’ అని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు

 కాంగ్రెస్‌ను వీడిన అనంతరం రాధికా ఖేడా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. చత్తీస్‌గఢ్‌లోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో కొందరు కాంగ్రెస్‌ నాయకులు తనను గదిలో బంధించి దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. 1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు

 హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు ఖర్చు దాదాపు 780 మిలియన్‌ డాలర్లు.. దిల్లీ మెట్రో ఖర్చు బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. కానీ, అమెరికాలో ఓ చిన్న కనెక్టింగ్‌ వంతెన నిర్మాణానికి ఎంత ఖర్చయిందో తెలుసా..? ఏకంగా రూ.91 వేల కోట్లు. దీని నిర్మాణానికి దాదాపు దశాబ్ద సమయం పట్టింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని