Corona: ఆలయం మూసివేత.. గుడి ముందే 50 వివాహాలు

తమిళనాడులో గుడి ముందు రోడ్డుపైనే పెళ్లిళ్లు జరిగాయి. కడలూరు జిల్లాలోని తిరువంతిపురం దేవనాథస్వామి ఆలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. ప్రత్యేక రోజుల్లో ఇక్కడ వందకుపైగా వివాహాలు జరుగుతుంటాయి....

Updated : 27 Apr 2021 15:23 IST

కడలూరు: తమిళనాడులో గుడి ముందు రోడ్డుపైనే పెళ్లిళ్లు జరిగాయి. కడలూరు జిల్లాలోని తిరువంతిపురం దేవనాథస్వామి ఆలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. ప్రత్యేక రోజుల్లో ఇక్కడ వందకుపైగా వివాహాలు జరుగుతుంటాయి. కరోనా రెండో దశ కారణంగా దేవాలయాల్లో వివాహాలు సహా ఇతర వేడుకలపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈనెల 24న మంచి ముహూర్తం కావటంతో దేవనాథస్వామి ఆలయం మూసివేసినప్పటికీ.. గుడి ముందు రోడ్డుపైనే వివాహాలు జరిగాయి. ఈ సందర్భంగా దాదాపు 50 జంటలు వివాహా బంధంతో ఒక్కటయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని